పాక్ భారత్ యుద్ధం కొనసాగుతోంది. జోక్ ఆఫ్ ది డే ఏంటంటే.. తమ స్థానాలను బహిర్గతం చేయకుండా ఉండటానికి భారతీయ డ్రోన్లను అడ్డుకోలేదని పాక్ డిఫెన్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్పుకోవడం..ఇదిలా ఉంటే.. పాక్పై మీమ్స్ వర్షం కురుస్తుంది. నెట్టింట పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో భాగంగా పాక్ ప్రపంచాన్ని ఎలా భయపెడుతుందో తెలుసా అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ” మీరు గనుక ఇండియాకు సపోర్ట్ చేస్తే మీ దగ్గర తీసుకున్న అప్పులను ఎగ్గొడుతామని ప్రపంచ దేశాలను భయపెడుతోంది” అంటూ పోస్టులు వస్తున్నాయి. పైగా ఈ మీమ్ డొనాల్ట్ జె ట్రంప్ అనే ఎకౌంట్ నుంచి షేర్ కావడంతో రీచ్ ఎక్కువగా ఉంది.
దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. హేయ్ నవ్వకండి.. ఇది సీరియస్ మ్యాటర్ అంటూ ఇంకా నవ్విస్తున్నారు. ”ఓహ్ పాక్ అలా చెప్తే అందరూ భయపడ్డారా.. హహహ”, ” దయచేసి పాక్కు ఇచ్చిన లోన్స్ లాస్ అసెట్గా పరిగణించండి” అని ఇంకొందరు అంటున్నారు. ” అయినా పాక్ చెల్లించే పరిస్థితుల్లో కూడా లేదులే”, ” నైస్ ఐడియా కదా” అంటూ ఇంకొందరు ఫన్నీగా స్పందిస్తున్నారు. ”ఎపిక్.. ఇంతగా ఎప్పుడు నవ్వుకోలేదు” అంటూ రియాక్ట్ అవుతున్నారు. సరేకానీ ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎకౌంటేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు..