కాంగ్రెస్ పార్టీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థుల జాబితా విడుదల..!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 284 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు ప్రకటించింది. బహ్రాంపుర్ (Baharampur) అసెంబ్లీ నియోజకవర్గ నుంచి పార్టీ సీనియర్ నేత, మాజీ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి(Adhir Ranjan Chowdhury) పోటీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. మాలతీపూర్ (Malatipur) నుంచి మరో కీలక నేత, ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ మౌసమ్ నూర్ పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రదీప్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు..పోటీలో ఉన్న కీలక అభ్యర్థుల్లో డార్జిలింగ్ నుంచి మధాప్ రాయ్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్, డుమ్ డుమ్ నుంచి సుస్మితా బిశ్వాస్, డైమండ్ హార్బర్ నుంచి గౌతమ్ భట్టారాయ్, అసాంసోల్ దక్షిణ్ నుంచి సౌవిక్ ముఖర్జీ, అసాంసోల్ ఉత్తర్ నుంచి ప్రసేన్‌జిత్ పుయితాండి పోటీ చేస్తున్నారు..