ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ ఖాతాలో మరో విజయం చేరింది. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో పంజాబ్ దుమ్ము రేపింది. లక్నో పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ బ్యాటర్లు సిక్సర్లు సునామీ సృష్టించారు. పరుగుల వరద పారించారు. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ (87) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 255 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేయగలిగింది. ఫలితంగా 54 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది. ఈ సీజన్ లో పంజాబ్ కు ఇది వరుసగా 5వ విజయం. ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుపొందింది. ఒక్క ఓటమి కూడా లేదు. అటు లక్నో జట్టుకి హ్యాట్రిక్ పరాజయం…
ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (37 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 93), కూపర్ కనోలి (46 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆపై బౌలర్లు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను కట్టుదిట్టం చేయడంతో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో పంజాబ్ భారీ విజయాన్నందుకుంది. ప్రస్తుతం పంజాబ్ 11 పాయింట్లతో టాప్‌లో ఉంది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 254 పరుగులు చేసింది. ఐపీఎల్లో ఈ జట్టుకిది రెండో అత్యధిక స్కోరు. ప్రిన్స్, సిద్ధార్థ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 200/5 స్కోరుకే పరిమితమై ఓడింది. సారథి రిషభ్ పంత్ (23 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లతో 43), మార్క్రమ్ (22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), మార్ష్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40), ఆయుష్ బదోని (21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) రాణించారు. యాన్సెన్ 2 వికెట్లు తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ప్రియాన్ష్ నిలిచాడు…