బంగారు కొండ బయటపడింది..ఎగబడిన జనం…

బంగారు కొండ బయటపడింది.. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు… తవ్వకాలు జరిపి సంచుల్లో మట్టిని ఇళ్లకు తీసుకెళ్లిపోయారు.. పెద్ద ఎత్తున తరలివచ్చి.. దొరికింది తీసుకొని వెళ్లిపోయారు.. దీంతో.. ఆ ప్రాంతంలో తోపులాట వరకు వెళ్లింది పరిస్థితి.. ఈ ఘటన రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలోలో జరిగింది… ప్రజల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. బంగారు కొండ ఉన్న ప్రాంతంలో ఆంక్షలు విధించింది ప్రభుత్వం.. కాగా, దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కొండల్లో… ఇటీవల బంగారు గనిని గుర్తించారు. దీంతో పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పలుగు, పారలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. గనిని తవ్వి బంగారంతో కూడిన మట్టిని సంచులు, తట్టల్లో ఇండ్లకు తీసుకెళ్లారు. అనంతరం నీటితో మట్టిని కడిగి అందులోని చిన్నచిన్న బంగారు రాళ్లను వెలికితీశారు. అహ్మద్ అల్గోబరీ అనే జర్నలిస్ట్‌ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక, ఇది నెట్టింట్లో వైరల్‌అయిపోయింది.