కన్నతల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు..

ఒక కూతురు తన తల్లిని దారుణంగా హింసించింది… కన్నతల్లిని చిత్రహింసలు పెట్టిన కూతురు.. మాటల్లో చెప్పలేని విధంగా కాళ్లతో తంతు.. జుట్టులాగి చెంపలపై కొట్టింది. పలు చోట్ల కొరికింది. కాలితో తన్నింది. తనను కొట్టవద్దని ఆ తల్లి వేడుకున్నప్పటికి వదిలిపెట్టలేదు..Daughter Tortures Mother) ఈ షాకింగ్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ తన తల్లి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఆమె చెంపపై కొట్టింది. జట్టు పట్టుకుని లాగింది. తల్లి శరీరంపై పలు చోట్ల కొరికింది. ఆమెను కాలితో తన్నింది. హర్యానా భాషలో తిట్టింది. తనను కొట్టవద్దని ఏడుస్తూ ఆ తల్లి వేడుకున్నప్పటికీ కుమార్తె కనికారం చూపలేదు. కొట్టడాన్ని ఆపలేదు.
https://x.com/ShoneeKapoor/status/1895004994476327013?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1895004994476327013%7Ctwgr%5E4369127c412ec11093812b236466c3c6b794bb4e%7Ctwcon%5Es1_c10&ref_url=http%3A%2F%2Fapi-news.dailyhunt.in%2F
కాగా, ఆ ఇంట్లో రహస్యంగా రికార్డ్‌ చేసిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కుమార్తె తన తల్లిని దారుణంగా హింసించిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ‘ఒక కూతురు తన తల్లిని హింసిస్తోంది. అది అత్తగారు కాదు, తన సొంత తల్లి అని తెలిసి నేను షాక్ అయ్యా’ అని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహిళపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. హర్యానా పోలీసులతోపాటు సీఎం నయాబ్ సింగ్ సైనీకి ఈ వీడియో క్లిప్‌ను ట్యాగ్ చేశారు.