లోక్‌సభ ప్రారంభం..ఉదయం 11 నుంచి 12 వరకు ప్రశ్నోత్తరాలు..!

ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం.

దివంగత సభ్యులకు సంతాపం తెలపనున్న లోక్‌సభ.

ఉదయం 11 నుంచి 12 వరకు ప్రశ్నోత్తరాలు
చమురు PSU న్యాయ వివాదాలపై సురేష్‌ గోపీ ప్రకటన.

నేడు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీపై తీర్మానం
తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న ఈటల, అజయ్‌ భట్‌
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు కోసం…

తీర్మానం ప్రవేశపెట్టనున్న అర్జున్ రామ్..

వర్షాకాల సమావేశాలు సరిగ్గా ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే, సమావేశాల ప్రారంభానికి ముందు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మీడియాతో మాట్లాడుతారు. ఈ సందర్భంగా సభ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని ప్రధాని కోరే అవకాశం ఉంది. ఇక లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా దివంగత సభ్యులకు సంతాపం తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి సభ సతాపం తెలుపనుంది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటలకు వరకు ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీపై తీర్మానాన్ని ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender), అజయ్ భట్ ప్రవేశపెట్టనున్నారు…