ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత…

ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత
Pavala Shyamala Death Reason.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామల

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అర్ధరాత్రి 1:52 గంటలకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్టు తెలిపిన వైద్యులు..

తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తనదైన నటనతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల (Telugu Actress Pavala Shyamala) కన్ను మూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. గత కొంత కాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె… మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ సిటీలోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.