ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగింది..కొన్నాళ్లుగా డిప్యూటీ సీఎం సైనసైటిస్ తో బాధపడుతున్నారు. అయితే నిన్న పరిస్థితి మరింత ఎక్కువ అవ్వడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో అత్యవసరంగా ఆయన సర్జరీ చేయించుకున్నారు. ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస సిబ్బందిని తొలగించినట్టు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ తర్వాత మళ్లీ పవన్ ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. వైద్యులు పవన్ కళ్యాణ్కు సరైన టెస్టులు కూడా నిర్వహించి సర్జరీ తర్వాత పది రోజుల పాటు ఆయనకు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.
ఏపీ డిప్యూటీ సీఎం కొన్ని రోజులుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఎక్కువగా సమస్య అవడంతో వైద్యులకు ఆయన ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలియజేశారు. దీంతో టెస్టుల ప్రకారం ఆయనకు సర్జరీ చేయాలని సూచించడంతో MRI తర్వాత శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత వెంటనే ఆయన్ను జనరల్ వార్డుకు కూడా తరలించి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం .ఇక పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. తమ అభిమాన నేతకు ఏమైందో అని జనసేన కార్యకర్తలు, అభిమానులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఇష్ట దైవం హనుమాన్కు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సైనసైటిస్ వ్యాధి లక్షణాలు ఇవే..
సైనటిస్ వ్యాధితో చాలామంది బాధపడుతూ ఉంటారు. సహజంగా ఇది ముక్కు చుట్టూ ఉన్న గాలితో నిండిన గుహలను ఇన్ఫెక్షన్ లేదా వాపు కారణంగా గాలి ఆడకుండా చేస్తుంది. జలుబు, ఎలర్జీ లేదా ఇతర వైరస్ వల్ల ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఈ వ్యాధి లక్షణాలు వేరువేరుగా ఉండవచ్చు. ముక్కు బ్లాక్ అవ్వడం, మూసుకుపోవటం వీటి ప్రధాన లక్షణాలు. దీంతో శ్వాస తీసుకోవడంలో చాలా కష్టంగా అనిపిస్తుంది..