అవిశ్వాస తీర్మానం సందర్భంగా..లోక్ సభలో ఆసక్తికర ఘటన..!

ఢిల్లీ :

నేడు అవిశ్వాస తీర్మానంపై లోక్ సభ లో ముగియనున్న చర్చ.

అవిశ్వాసంపై సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోడీ సమాధానం, ప్రధాని ప్రసంగం తరువాత అవిశ్వాసంపై ఓటింగ్.

సుమారు 350 మంది ఎంపీల మద్దతుతో వీగిపోతున్న అవిశ్వాస తీర్మానం.

అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కావాల్సిన మెజారిటీ 272..

ఎన్డీఏ బలం ముందు అవిశ్వాస తీర్మానం నిలవదు. ఈ విషయం విపక్షాలకు కూడా తెలుసు. తమ ఉద్దేశం ప్రభుత్వాన్ని గద్దెదించాలని కాదని, ఈ విధంగానైనా మోదీ పార్లమెంట్కు వచ్చి మణిపూర్ హింసపై మాట్లాడతారని ఇండియా కూటమి చెబుతోంది.

నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేటి నుంచి పార్లమెంట్లో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల మధ్య లోక్సభలో వాడివేడి మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది…..

అవిశ్వాస తీర్మానం
(No Confidence Motion) పై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చర్చలో పాల్గొన్న శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఎంపీ శ్రీకాంత్ షిండ్.. తనకు హనుమాన్ చాలీసా పూర్తిగా కంఠస్థం వచ్చునని చెబుతూ, హనుమాన్ చాలీసాను చదవడం ప్రారంభించారు..