కృత్రిమ కొరతను సృష్టిస్తూ,,..డబ్బును దండుకుంటున్న పెట్రోల్ బంక్ యాజమాన్యులు..!

*కృత్రిమ కొరతను సృష్టిస్తూ,,.. డబ్బును దండుకుంటున్న పెట్రోల్ బంక్ యాజమాన్యులు..

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు పెట్రోల్ బంకులు ముందస్తుగానే నో స్టాక్ బోర్డులు పెట్టడం..

మరి కొన్ని బంకులు అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లు వసూలు చేయడం జరుగుతోంది..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ కొరత లేదు అని చెప్తున్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల ద్వారా పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదో అనుకుంటూ ముందస్తు స్టాక్ పెట్టుకుంటూ, భారీ స్థాయిలో పెట్రోల్ డీజిల్ వినియోగం చేయడం జరుగుతుంది…. అంతేకాకుండా ఇదే అదునుగా అనధికారికంగా అధిక రేట్లు వసూలు చేస్తూ ప్రజల వద్ద దోపిడీ చేస్తున్నాయి పెట్రోల్ బంకులు… కనీసం ఇలా వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు… దీంతో ఆగ్రహించిన వాహనం దారులు అడ్డగోలుగా రేట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. సుమారు లీటర్కు ఐదు రూపాయల నుండి మూడు రూపాయల వరకు పెంచడం ఏమిటంటే ప్రశ్నిస్తున్నారు……. ఇప్పటికే నిత్యవసర సరుకల ధరలు ఆకాశాన్ని అంటుంటే మళ్లీ సామాన్యులపై ఇలా భారం మోపడేమిటంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలా అనధికారకంగా పెంచిన ధరలను దృష్టిలో ఉంచుకొని బంకు యాజమాన్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు…