ఇంధన కొరత ప్రమాదం పొంచి ఉన్నది…!!!!

ఇన్ని రోజులు పెట్రోల్ డీజిల్ ధరలతో అతలాకుతలం అవుతున్న సామాన్యులకు కాస్త ఊరట నవ్వించేలా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి అని హర్షం వ్యక్తం చేసేలోపే…
మరొక ప్రమాదం పొంచి ఉంది… మహానగరంలో
ఇంధన కొరత ప్రమాదం పొంచి ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తోంది. సీటిలో బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ నో స్టాక్ అంటూ బోర్డులు దర్శనమివ్వటం కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో 20శాతం పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. అయిల్ కంపెనీలు వాస్తవ కోటాకు 25శాతం కోత విధించడం అదే సమయంలో క్రెడిట్ విధానాన్ని రద్దు చేయటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు. ఇదే విషయంపై ఈ నెల 31న నిరసన తెలుపుతాం అంటున్నరు పెట్రోల్ బంక్ ల యజమానులు..వారం రోజులుగా నగరంలో కొన్ని బ్యాంకుల్లో డీజిల్, పెట్రోల్ నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయంగా చమురు నిల్వల కొరతపై తీవ్ర దుమారం రేగుతున్నప్రస్తుత పరిస్థితుల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ కోటా విధానాన్ని అమల్లోకి తేవటం ఇంధన కొరతకు కారణమని తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు వీపరీతంగా పెరిగినందున, పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 25 రూపాయలు నష్టం వస్తోందని అందువల్ల తగినంత సరఫరా చేయలేనిమని భారత్ పెట్రోల్ బంక్ కార్పోరేషన్ బంకులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది…సిటీలో సుమారుగా 500ల వరకు బంకులు ఉండగా.. ప్రతిరోజు 35లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు గణంకాల ద్వారా తెలుస్తోంది. నగరంలో 72లక్షలకు పైగా వాహనాలు ఉండగా.. ప్రతిరోజు వెయ్య వరకు కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి…