గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదం, ప్రభుత్వ జీవో అనంతరం ఈ రోజు ఉదయం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో ప్రొఫెసర్ కోదండరామ్, మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరై నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. మండలిలో అడుగుపెట్టిన ఈ ఇద్దరు దిగ్గజాలు రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు..ప్రమాణ స్వీకారం అనంతరం అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ప్రస్తుతానికి నాకు పొలిటికల్ ఫ్యాన్స్ కంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువే ఉండొచ్చు. కానీ, ఇకపై ప్రజల కోసం కష్టపడి పనిచేసి రాజకీయ అభిమానులను కూడా సంపాదించుకుంటాను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్సీగా, మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి, సహచర మంత్రులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక ఆటగాడిగా దేశానికి ఎలాగైతే సేవ చేశానో, అలాగే ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.