సిగ్గు శరం ఉంటే ఆ పని చేయండి!” – పహల్గామ్ వీరుడి భార్య ఘాటు వ్యాఖ్యలు…!

పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటంపై భారతీయులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాల వేదనను విస్మరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం తగదని పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభమ్ ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు..ఆసియా కప్ 2025లో భాగంగా యూఏఈలో జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆమె ప్రజలను, క్రికెటర్లను కోరారు.

దేశభక్తిపై ప్రశ్నించిన ఐశాన్య ద్వివేది

ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఐశాన్య ద్వివేది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “దయచేసి ఈ మ్యాచ్‌ను బహిష్కరించండి. ఎవరూ స్టేడియంకు వెళ్ళి చూడొద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా ఆన్ చేయొద్దు” అని ప్రజలను కోరారు. బీసీసీఐ వైఖరిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. “ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల బీసీసీఐకి ఏమాత్రం సానుభూతి లేదా?” అని ఆమె ప్రశ్నించారు..