ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావుకు నోటీసులు జారీ..!

ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే తెలంగాణలో సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిట్ తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి సీఆర్పీసీ 160వ సెక్షన్ కింద నోటీసు ఇచ్చారు. ఇప్పటికే సిట్ అధికారులు బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లను విచారణ చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నలను సిట్ విచారణ చేసింది.

అన్నింటికి సమాధానం ఇస్తా : సిట్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేత సంతోష్ రావు స్పందించారు. చట్టాన్ని గౌరవిస్తానని, రేపటి విచారణకు హాజరవుతానని తెలిపారు. పోలీసులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు…

రేపు(మంగళవారం, జనవరి 27వ తేదీ) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనడం గమనార్హం. CRPC 160 క్రింద సిట్‌ నోటీసులు జారీ చేసింది.రేపు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.రేపు తెలంగాణ భవన్ కు రానున్న సంతోష్ రావు. తెలంగాణ భవన్ నుంచి సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు.

కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడిగా ఉండటంతో పాటు ఆయన వ్యక్తిగత, పార్టీ విషయాల్లోనూ చక్రం తిప్పిన సంతోష్ రావు పాత్రపై సిట్‌ విచారించేందుకు సిద్ధమైంది. కేసీఆర్‌ ఓఎస్డీ రాజశేఖర్‌రెడ్డిని విచారించిన సమయంలో ఆయన వెల్లడించిన అంశాలు, రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో ఇచ్చిన వివరాల ఆధారంగా సంతోష్ రావును ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నాటి సీఎం ఇంటి నుంచి కాగితంపై చేత్తో రాసిన కొన్ని ఫోన్‌ నంబర్లు తనకు అందాయని, వాటిని ఎస్‌ఐబీలోని ప్రణీత్‌రావుకు ఇచ్చి ట్యాపింగ్‌ చేయించానని రాధాకిషన్‌రావు వాంగ్మూలమిచ్చిన నేపథ్యంలో ఆ చేతిరాత ఎవరిది? ఎవరి ద్వారా ఆ స్లిప్పులు రాధాకిషన్‌రావుకు చేరాయి? ఎవరు ఆదేశిస్తే ఆ నంబర్లను పంపారనే అంశాలను తేల్చేందుకు సంతోష్ రావును విచారించరున్నారు..