పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత అతి త్వరలో విడుదల కానుంది. నివేదికల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో 21వ విడత డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది. నవంబర్ 5న రైతుల (PM Kisan 21st Installment) ఖాతాల్లో రూ. 2వేలు జమ అవుతుందని భావిస్తున్నారు. చాలా కాలంగా 21వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు..
పీఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు వస్తుందంటే? :
కేంద్ర ప్రభుత్వం 21వ వాయిదా విడుదల లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ, నివేదికల ప్రకారం.. నవంబర్ 5 నాటికి రూ. 2వేలు విడుదల చేసే అవకాశం ఉంది. ఛట్ పండుగ తర్వాత వెంటనే పీఎం కిసాన్ విడత డబ్బులు విడుదల చేస్తారని భావించగా అది జరగలేదు.
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో సుమారు 2.7 మిలియన్ల మంది రైతులు ఇప్పటికే రూ. 2వేలు ముందస్తుగా అందుకున్నారు. ఈ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల జరిగిన తీవ్ర నష్టం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ రైతులకు ముందుగా పీఎం కిసాన్ విడతను విడుదల చేసింది. ఇప్పుడు, ఇతర రాష్ట్రాల రైతులు కూడా త్వరలో రూ. 2వేలు తమ అకౌంట్లలో పడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు..