ప్రధాని మోడీ మౌనం విడాలి..మూడోరోజూ దద్దరిల్లిన పార్లమెంట్..!

అమెరికాలో అదానీ సంస్థపై కేసు నమోదు, ఈ సంస్థపై వచ్చిన లంచం ఆరోపణలపై చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. కానీ ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో గురువారం మూడో రోజూ పార్లమెంట్ ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి.
*మూసీ నదిని బాగు చేయాలి కానీ పేదల ఇళ్లు కూల్చి బాగు చేస్తామంటే ఒప్పుకునేది లేదు… మాజీ మంత్రి హరీష్ రావు*
..

https://r9telugunews.com/brs-paarti-haresh-rao-4/

ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సభా కార్యకలాపాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు నిర్వహించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. దీంతో వెంటనే ప్రతిపక్ష పార్టీల సభ్యులు తమ స్థానాల్లో నుంచి లేచి నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లారు. అదానీ వ్యవహారంపై చర్చ జరపాలని, ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరపాలని, ప్రధాని మోడీ నోరు విప్పాలని, ప్రభుత్వం వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వెంటనే సభను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ పున్ణప్రారంభమైన తరువాత కూడా ఎటువంటి మార్పు రాలేదు. దీంతో లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాలో అదానీ సంస్థపై కేసుకు సంబంధించి చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. చైర్మెన్ జగదీప్ ధన్కర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభలు పున్ణప్రారంభమైన తర్వాత కూడా సభలో మార్పు రాలేదు. దీంతో సభను నేటికి వాయిదా వేశారు.
వక్భ్బోర్డు బిల్లుపై జేపీసీ కాల పరిమితి పెంపు
వచ్చే బడ్జెట్ సమావేశాల చివరిరోజు వరకు పొడిగింపు
వక్ఫ్బోర్డు సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కాల పరిమితిని 2025 బడ్జెట్ సమావేశాల చివరి రోజు వరకు పొడిగించారు. గురువారం లోక్సభలో జేపీసీ చైర్మెన్ జగదాంబికా పాల్ తీర్మానాన్ని ప్రవేశపె ట్టారు. ఈ విషయంపై చర్చించి, వీలైనంత ఎక్కువ మంది భాగస్వామ్యులతో ఏకాభిప్రాయం పొందాలనుకుంటుం దని, అందుకు పొడిగింపు డిమాండ్ తగిన నిదర్శనమని అన్నారు. ఒక్క ఢిల్లీలోనే 147 మంది ప్రతినిధులతో జేపీసీ 29 సమావేశాలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు.పార్లమెంట్ సమావేశంలో మోజువాణి ఓటింగ్తో వక్ప్ బిల్లుపై జేపీసీ కాలపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు..