ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో వుధ్ఘటన..

*ఆస్ట్రేలియా మినీ భారతదేశం*
*ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనలో వుధ్ఘటన*

*భారత్ ఆస్ట్రేలియా సంభందాలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి*
*ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రధాని అంతోనీ అల్బేని*

సిడ్నీ(ఆస్ట్రేలియా),
విశాఖపట్నం, మే23, భారత దేశ ప్రధాని 3 దేశాల పర్యటన సందర్భముగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగముగా ఆస్ట్రేలియా లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలిసిన అనంతరం చివరి రోజు ఆస్ట్రేలియా లో నివసిస్తున్న భారత సంతతిి ప్రజలను సిడ్నీ ఒపేరా హౌస్ లో కలిసి భారతీయ సంతతి కీ చెందిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో భాగముగా ఆస్ట్రేలియా దేశంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కాన్బెర్రా, మెల్బోర్న్,ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయులు ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక విమానలలో సిడ్నీ నగరంలోని సిడ్నీ ఒపేరా హోస్ కు చేరుకొని భారతీయ కళారూపాలను ప్రదర్శించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని అంతోనీ అల్బెని తో కలసి ప్రధాని నరేంద్ర మోడీ సభప్రంగానాం వద్దకు చేరుకోగానే ప్రజలందరూ మోడీ మోడీ మోడీ పేరుతో హర్షధ్వానాలు చేస్తూ కేరళ వాయిద్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు., ప్రధాని నరేంద్ర మోడీ కీ న్యూ సౌత్ వేల్స్ మేయర్ స్వాగతోపన్యసం చేశారు,,అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంతోని అల్బేని మాట్లాడుతూ భారత్ ఆస్ట్రేలియా మధ్య సంభందాలు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాయి అని చెప్పారు. ఆస్ట్రేలియా లో ఏంతో మంది భారతీయులు వివిధ వ్యాపార ఉద్యోగ రంగాలలో స్థిరపడ్డారు అని వారంతా ఆస్ట్రేలియా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఏంతో మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వస్తువుంటారని చెప్పారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారత ఆస్ట్రేలియా సంభందాలు ఈనాటివి కాదని గత 75 సంవత్సరాలు గా కొనసాగుతున్నాయి అని చెప్పారు. మొట్ట మొదటగా క్రికెట్ క్రీడ తో ఈ రెండు దేశాల మధ్య సంభందాలు మొదలయ్యాయి అని చెప్పారు,,ఏంతో మంది ఆస్ట్రేలియా పురుష క్రికెట్ క్రీడాకారులు, మహిళ క్రికెట్ క్రీడాకారులు భారతదేశంలో జరిగే ఐపియల్ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రఖ్యాత స్పిన్నర్ షేన్ వార్న్ మరణించినప్పుడు ఏంతో మంది భారత క్రీడాభిమానులు విచారం వ్యక్తం చేశారని చెప్పారు. ఆస్ట్రేలియా భారత్ సంభందాలు 3సి, 3డి,3ఈ,మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పారు,,సిడ్నీ నగరంలోని మినీ భారత్ నిర్మాణానికి సహకరించిన ఆస్ట్రేలియా ప్రధానికి, న్యూ సౌత్ వేల్స్ మేయర్ కు కౌన్సిలర్ల కు కృతజ్ఞతలు తెలియజేశారు. భారత దేశం ఎన్నో రంగాలలో ప్రపంచంలోనే ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలలో కొనసాగుతుంది అని చెప్పారు. సెల్ ఫోన్లను ఉత్పత్తి చేయడంలోనూ వాడకంలోను భారత్ ప్రథమ స్థానంలో వుందని చెప్పారు. దేశంలో సామర్థ్యానికి ఎలాంటి లోటు లేదని ప్రపంచంలోనే యువ శక్తి లో భారత్ ప్రధాన స్థానం లో వుందని చెప్పారు,వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో భారత్ ప్రథమ స్థానం లో వుందని చెప్పారు,,ప్రపంచంలో టర్కీ, సిరియా సహా అనేక దేశాలలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలలో ఆయా దేశాల ప్రజలకు భారత ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిందని చెప్పారు. ప్రపంచంలోనే కరోనా టీకాలు ను ప్రజల కు అందించడంలో భారత్ ప్రథమ స్థానం లో వుందని చెప్పారు,, కరోన సమయంలో సుమారు 100 దేశాలకు భారత్ నుంచి మందులను వైద్య పరికరాలను వైద్యులను పంపించడం జరిగింది అని చెప్పారు,,ఆస్ట్రేలియా దేశం లోని మొదటి ప్రపంచయుద్ధం లో పెర్త్ నగరం లోని ఓడ రేవు వద్ద జరిగిన యుద్ధంలో మరణించిన భారతీయ సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు,,స్టార్టప్ రంగంలో భారత్ ప్రపంచం లోనే తృతీయ స్థానంలో వుందని చెప్పారు,,తాను 2014 లో ఆస్ట్రేలియా పర్యటనకు వోచ్చనని అంతకు ముందు 28 సంత్సరాలు ఏ భారత ప్రధాని ఆస్ట్రేలియా దేశంలో పర్యటించలేదని తాను 2014 లో పర్యటనకు వచ్చినప్పుడే చెప్పానని తాను మరల 5సంవత్సరల లోపు మరల ఆస్ట్రేలియా పర్యటనకు వస్తానని మాట ఇచ్చానని ఆ మాట ప్రకారమే ఈ రోజు మీ వద్దకు వొచ్చనని చెప్పారు,, భారత ఆర్థిక వృద్ధి రేటు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది అని ప్రపంచం లో అన్ని దేశాల్లో బ్యాంకింగ్ రంగం దెబ్బతిన్న భారత్ లో మాత్రం బ్యాంకింగ్ రంగం సమృద్దిగా వుందని చెప్పారు, రాబోయే 25 సంవత్సరాల్లో ప్రపంచంలోనే భారత్ నెంబర్1 దేశం గా అవతరించడం కాయమనీ చెప్పారు,,ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రముఖులు ప్రవాస భారతీయ ప్రముఖులు ఆస్ట్రేలియా లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న భారతీయ ప్రజానికం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు,,భారతీయ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవ్వడం విశేషం,,