అన్నింటినీ భరిస్తాం.. సుంకాల డెడ్ లైన్ పై మోదీ.

రేపటి నుంచి అమల్లోకి 50% సుంకాలు!

భారత ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే 25% సుంకాలు ఉన్న నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కారణంగా చూపుతూ ట్రంప్ మరో 25% సుంకాలను విధించారు. ఈకొత్త సుంకాలు ఆగస్టు 27 తెల్లవారుజాము 12:01 గంటల నుంచి వర్తిస్తాయని అమెరికా తాజాగా నోటీసులు జారీ చేసింది..

అమెరికా విధించిన సుంకాల అమలు గడువు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు, పశుపోషకులు, చిన్న తరహా పరిశ్రమల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో తమపై ఒత్తిడి పెరగొచ్చని.. కానీ దానిని భరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ భారతను ఇతర దేశాలపై ఆధారపడేలా చేసిందన్నారు…