ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని మోడీ ఫోన్…

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. యుద్ధం విషయంలో దౌత్యానికి మోడీ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పేర్కొన్నారు.

గత ఐదు రోజులుగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. గల్ఫ్ దేశాల్లో భారీగా ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో గల్ఫ్ దేశాధినేతలకు మోడీ ఫోన్ చేసి ఖండించారు.

తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ఫోన్ చేసి యుద్ధం ముగింపునకు దౌత్యం నిర్వహించాలని కోరారు. ”ఈ రోజు నా స్నేహితుడు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడాను. పశ్చిమాసియా పరిస్థితి, చర్చలు, దౌత్యానికి సంబంధించి మా ఉమ్మడి ఆందోళనలను చర్చించాం. శాంతి, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి మేము దగ్గరగా పాల్గొనడం, ప్రయత్నాలను సమన్వయం చేయడం కొనసాగిస్తాం.” అని రాసుకొచ్చారు. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ సంభాషణ జరిగిందని.. ప్రపంచ నాయకులు సంయమనం, దౌత్యపరమైన చర్చలకు మోడీ పిలుపునిచ్చారు.

గత నెల 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. దీంతో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు చనిపోయారు. అనంతరం ఇరాన్ కూడా ప్రతీకారంగా దాడులకు దిగింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి..