రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది..ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది…
బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ జట్టు ఆది నుంచి ధాటిగా ఆడింది. ఓపెనర్ సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్‌తో భారత జట్టు భారీ స్కోరు చేసింది.
సంజూ శాంసన్ 89, శివమ్ దుబే 43, ఇషాన్ కిషన్ 39 పరుగులు చేశారు.
అక్షర్ పటేల్ అద్భుతమైన క్యాచ్‌తో...
(India national cricket team) తరపున ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు..ముంబైలోని వాంఖడే (Wankhede Stadium) లో జరిగిన ఈ మ్యాచ్‌లో అతని ఫీల్డింగ్ అభిమానులను 1983 వరల్డ్ కప్ ఫైనల్‌ను గుర్తు చేసింది. ఈ టోర్నమెంట్ మొత్తం భారత జట్టు ఫీల్డింగ్‌పై విమర్శలు వస్తున్నప్పటికీ, సెమీఫైనల్లో అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్‌తో అన్ని సందేహాలకు ముగింపు పలికాడు.
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మొదటి వికెట్..
ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt) వికెట్ భారత జట్టుకు మొదటి బ్రేక్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వేసిన ఓవర్ తొలి బంతికే సాల్ట్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.
బంతి ఎత్తుగా గాల్లోకి వెళ్లగా, అక్షర్ పటేల్ దానిని సరిగ్గా అంచనా వేసి అద్భుత క్యాచ్ పట్టాడు.
కపిల్ దేవ్‌ను గుర్తు చేసిన క్యాచ్..
https://x.com/i/status/2029588128080728453
అక్షర్ పటేల్ అసలు అద్భుతం తర్వాత జరిగింది. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వేసిన స్లో బంతిని హ్యారీ బ్రూక్ (Harry Brook) తప్పుగా టైమ్ చేశాడు. బంతి చాలా ఎత్తుగా గాల్లోకి వెళ్లింది. ఆ సమయంలో 30 యార్డ్ సర్కిల్లో నిలిచిన అక్షర్ పటేల్ దానిని పట్టుకోవడానికి సుమారు 24 మీటర్లు పరుగెత్తాడు.
చివరి క్షణంలో డైవ్ చేస్తూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ చూసిన అభిమానులు 1983 వరల్డ్ కప్ ఫైనల్లో కపిల్ దేవ్ (Kapil Dev) పట్టిన ప్రసిద్ధ క్యాచ్‌ను గుర్తు చేసుకున్నారు.
ఆరంభంలోనే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 7 బంతుల్లో 9 పరుగులు చేసిన అభిషేక్.. 2వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. విల్ జాక్స్ అతని వికెట్ తీశాడు.
డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 67 పరుగులు చేసింది భారత జట్టు.
అనంతరం, ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
భారత్ 10 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.
ఓపెనర్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు.
18 బంతుల్లో 39 పరుగులు చేసిన ఇషాన్.. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో జాక్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
14వ ఓవర్ తొలి బంతికి, భారత్ స్కోర్ 160 పరుగుల వద్ద సంజూ ఔటయ్యాడు.
సంజూ 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. సంజూ వికెట్ విల్ జాక్స్‌కు దక్కింది.
టీం ఇండియా 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి, మూడు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.
అనంతరం, 16వ ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు…
సిక్సర్లతో ఫామ్‌లో ఉన్న శివమ్ దుబే 43 పరుగులు చేశాడు. 18వ ఓవర్ మూడో బంతికి రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ వెంటవెంటనే 3 సిక్సర్లు కొట్టి రన్‌రేట్ పెంచాడు.
కేవలం 7 బంతుల్లో 21 పరుగులు చేసిన తిలక్ వర్మ ఆర్చర్ వేసిన యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
హార్డిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. 19 ఓవర్ 5వ బంతికి రెండో రన్ కోసం ప్రయత్నిస్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.
మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత జట్టు 253 పరుగులు చేసింది…
టోర్నమెంట్లో బెస్ట్ క్యాచ్?
అక్షర్ పటేల్ పట్టిన ఈ క్యాచ్‌ను చాలామంది ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ క్యాచ్ గా అభివర్ణిస్తున్నారు. అద్భుత క్యాచ్ చూసిన వెంటనే భారత ఆటగాళ్లు అందరూ అక్షర్ దగ్గరకు పరుగెత్తి సెలబ్రేట్ చేశారు..
గెలిపించిన బుమ్రా..
చివరి 18 బంతుల్లో ఇంగ్లండ్ విజయానికి 45 పరుగులు అవసరం కాగా.. 18వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో చివరి 12 బంతుల్లో ఇంగ్లండ్ విజయానికి 39 పరుగులు అవసరమయ్యాయి. హార్దిక్ పాండ్యా 19వ ఓవర్లో తొలి బంతినే సిక్సర్ బాదిన జాకోబ్ బెతెల్ 45 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవర్ మూడో బంతికి సామ్ కరణ్‌ను ఔట్ చేసిన హార్దిక్ పాండ్యా.. తర్వాతి మూడు బంతులను కట్టడిగా వేసి ఈ ఓవర్లో మొత్తం 9 పరుగులే ఇచ్చాడు.
ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. శివమ్ దూబే వేసిన ఈ ఓవర్ తొలి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో డేంజరస్ బెతెల్ రనౌటయ్యాడు. తర్వాతి రెండు బంతులను డాట్ చేసిన శివమ్ దూబే.. భారత్ విజయాన్ని లాంఛనం చేశాడు. చివరి మూడు బంతుల్లో మూడు సిక్స్‌లు, వైడ్ ఇచ్చినా.. టీమిండియాకు నష్టం జరగలేదు. పరుగుల వరద మారిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన బుమ్రా 33 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది…