పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష..
హైదరాబాద్ అంబర్పేట్లో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు వడ్లూరి పవన్ (22)కు నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు కేసులో వెల్లడైంది.
ఈ ఘటనపై బాధితురాలి తల్లి అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా… పోలీసులు నిందితుడిపై IPC సెక్షన్ 376(3), పోక్సో చట్టంలోని సెక్షన్ 5(l) r/w 6 కింద కేసు నమోదు చేశారు.
ఆరోపణలు రుజువు కావడంతో నాంపల్లి కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ₹10 వేల జరిమానా విధించింది.
బాలలపై లైంగిక నేరాల విషయంలో కఠిన చర్యలు తప్పవన్న సందేశాన్ని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేస్తోంది.