అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని తన 6, 3 ఏళ్ల ఇద్దరు కొడుకులను చంపిన కేసులో తల్లి పవిత్రకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
2017లో చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కవ్వంపల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ వేమన్నతో ఏర్పడిన అక్రమ సంబంధమే దీనికి కారణం
అంగన్వాడీ నుంచి పిల్లలను తెచ్చి, ఒకే నైలాన్ తాడుకు ఇరువైపులా ఇద్దరి మెడలకు బిగించి ఫ్యాన్కు ఉరివేసి అతి దారుణంగా హత్య
సుదీర్ఘ విచారణ అనంతరం చిత్తూరు జిల్లా 9వ అదనపు జడ్జ్ ఎన్.శ్రీనివాసరావు నిందితురాలు పవిత్రకు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు
కోర్టు తీర్పు వెలువరించిన వెంటనే పోలీసులు పవిత్రను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.