త్వరలో జర్నలిస్టులకు.అక్రిడిటేషన్లు.
అధికారులకు.
*రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమ కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.*
* ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన జర్నలిస్టు లకు అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు.
* బుధవారం సెక్రటే రియెట్లో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆ ర్వో మల్సూర్తో కలిసి అక్రిడిటేషన్ పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు.
* అర్హులైన జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేలా శాస్త్రీయ పద్దతిలో అక్రి డిటేషన్ పాలసీ ఉండాలని అధికారులను ఆదేశించారు.
* వీలైనంత త్వరగా అక్రిడిటే షన్ కార్డులను జారీ చేయడానికి ఈ నెల చివరినాటికి పాలసీ విధివిధానాలను కొలిక్కి తీసుకురావాలని సూచించారు…
సచివాలయంలో బుధవారం మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీఎంవోసీపీఆర్వో మల్సూర్తో సమావేశమైన మంత్రి అక్రిడిటేషన్ విధివిధానాలపై చర్చించారు. వీలైనంత త్వరగా అక్రిడిటేషన్ కార్డులను జారీ చేసేందుకు ఈనెల చివరినాటికి పాలసీ విధివిధానాలను రూపొందించాలన్నారు