నియంత్రణ రేఖ వద్ద భారత్ లొకి ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టుల చొరబాటు యత్నం..!

పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులు శుక్రవారం చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసి, భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులను హతమార్చారు..పూంచ్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద గత రాత్రి కొంత ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అప్రమత్తమైన దళాలు వేగంగా చొరబడుతున్న ఉగ్రవాదులను నిమగ్నం చేశాయి, తీవ్రమైన మరియు భారీ కాల్పులను ప్రారంభించాయి…

రాత్రి మొత్తం ఆపరేషన్ కొనసాగింది, ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. .
ఈ ప్రాంతంలో ఇప్పటివరకు జరిపిన సెర్చ్ ఫలితంగా అనేక ఆయుధాలు,, పేలుడు ఫర్దార్థాలు స్వాధీనపరచుకోవడం జరిగింది… మరికొందరు దాగి ఉన్నారని సమాచారంతో పూర్తిస్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

సరిహద్దు కంచె గుండా ఎలాంటి చొరబాటు జరగకుండా భారీగా బందోబస్తును రంగంలోకి దించారు.
ఆ ప్రాంతంలో సైనికులు క్షుణ్ణంగా సోదాలు చేస్తున్నారు..