ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..

అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ.._

* ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి..

ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో విజయవంతంగా కొనసాగుతోందని అలానే ‘ప్రజావాణి’ని గ్రామీణ ప్రజలకు మరింత చేరువ చేయాలని, కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రజావాణి సేవలను మండల స్థాయికి విస్తరించాలని ఆదేశించారు..