శ్రీరాముడు పండ్లు దొంగిలించాడంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా, మతపరంగా పెను దుమారం రేపాయి. దీనిపై నాగబాబు ఘాటుగా స్పందిస్తూ “రాముడిపై విషం చిమ్మేవారు కాలగర్భంలో కలిసిపోతారు” అని హెచ్చరించారు. వరుస కేసుల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. ఒక లిటరరీ ఫెస్టివల్లో తాను చేసిన ప్రసంగాన్ని కావాలనే వక్రీకరించారని, రాముడిని ఎగతాళి చేయలేదని తెలిపారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారే తనను ‘హిందూ వ్యతిరేకి’గా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. రామాయణంపై ఆయన చేసిన విశ్లేషణ హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఇటీవల జరిగిన ఒక బహిరంగ చర్చలో ప్రకాష్ రాజ్ రామాయణ గాథను పూర్తిగా కొత్త కోణంలో విశ్లేషించారు. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగకు చెందిన నాయకుడని పేర్కొన్నారు. కేవలం ప్రాంతీయవాదాన్ని తెరపైకి తేవడమే కాకుండా, రాముడు పండ్లు దొంగిలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైందన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు దావానలంలా వ్యాపించాయి. కోట్లాది మంది ఆరాధ్య దైవమైన రాముడిని ఇలా కించపరచడంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.తాజాగా రామాయణంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ, ప్రకాష్ రాజ్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే మతపరమైన అంశాలను వక్రీకరిస్తున్నారని నాగబాబు మండిపడ్డారు. ‘ప్రతి దానికి విమర్శలే కాకుండా, మన మూలాలను, ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. గతంలో హిందూ ధర్మాన్ని అవమానించినవారు కాలగర్బంలో కలిసిపోయిన సంగతి గుర్తుంచుకోవాలి’ అంటూ ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా #BanPrakashRaj అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ప్రకాష్ రాజ్ ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని, గిరిజనుల హక్కుల పేరుతో పురాణాలను తప్పుగా చిత్రించారని హిందూ సంఘాలతో పాటు కొన్ని గిరిజన సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ప్రకాష్ రాజ్ వివరణ
ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ప్రకాష్ రాజ్ తాజాగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో ఆయన తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఒక లిటరరీ ఫెస్టివల్లో “ఆర్ట్ అండ్ ఇట్స్ రెజిలియన్స్” అనే అంశంపై తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను కొందరు కావాలనే వక్రీకరించారని ఆయన పేర్కొన్నారు. తాను అవతార పురుషుడైన శ్రీరాముడిని ఎగతాళి చేయలేదని, హిందూ ధర్మాన్ని కించపరచలేదని స్పష్టం చేశారు. అన్ని ధర్మాలను ప్రేమించే తనకు ఎవరినీ తక్కువ చేయాల్సిన అవసరం లేదని, మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే వారు తనను ‘యాంటీ హిందూ’గా చిత్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం తాను ప్రకృతి ఒడిలో సమయం గడుపుతున్నానని చెప్పారు. తనపై విమర్శలు చేసేవారు వారి పనులు చూసుకోవచ్చని, తాను త్వరలోనే తిరిగి వస్తానని చెబుతూ ఆ వీడియోను ముగించారు.చారని హిందూ సంఘాలతో పాటు కొన్ని గిరిజన సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.