పిసిసి రద్దు మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయం…!

హిమాచల్‌ప్రదేశ్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి)ను బుధవారం రద్దు చేశారు. పిసిసితో పాటు రాష్ట్రంలోని అన్ని బ్లాక్‌, జిల్లా యూనిట్లను రద్దు చేస్తూ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నారు..ఈ విషయాన్ని మేరకు కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించాలనే యోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. “రాష్ట్రంలోని పిసిసి యూనిట్‌తో పాటు జిల్లా, బ్లాక్‌ కమిటీలు రద్దు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. దీనికి పార్టీ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుంది” అని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం పీసీసీగా చీఫ్‌గా ఉన్న ప్రతిభా సింగ్‌ను ఇటీవల సీడబ్ల్యూసీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.