చిరంజీవిని కలిసిన ‘పుష్ప’ చిత్ర బృందం..!…

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ‘పుష్ప: ది రూల్‌’ టాక్‌ నడుస్తోంది. అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది..ఈ క్రమంలో చిత్ర బృందం అగ్ర కథానాయకుడు చిరంజీవిని (Chiranjeevi) కలిసింది. దర్శకుడు సుకుమార్‌, మైత్రీ నిర్మాతలు నవీన్‌, రవి, సీఈవో చెర్రీలు చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘పుష్ప2’ విశేషాలను చిరు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది..మరోవైపు సుకుమార్‌ తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ నటిస్తున్నారు. ఇది పూర్తయ్యేలోపు సుకుమార్‌ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ సినిమాని అత్యంత భారీ సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించింది. ‘గొప్ప పని కోసం శక్తిమంతమైన శక్తులు మళ్లీ కలుస్తున్నాయి’ అంటూ గుర్రం బొమ్మ ఉన్న పోస్టర్‌ను షేర్‌ చేశారు. భారతీయ చిత్ర పరిశ్రమను మరింత కలర్‌ఫుల్‌ చేసేందుకు RC17 రానుందని తెలిపారు. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే..