తెలంగాణలో పుష్ప-2 విడుదలకు లైన్క్లియర్
టికెట్ చార్జీలపెంపును నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్
బెనిఫిట్షోకు రూ.800 వసూలు చేస్తున్నారని పిటిషన్
చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపలేమన్న హైకోర్టు
తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా..
డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు ఝామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చారు.
#పుష్ప2 రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 9.30 గంటలకు వేసే బెనిఫిట్ షోలకు మాత్రం సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో బెనిఫిట్ షోలకు 800 రూపాయలు టికెట్ ధర పెంచుకునేలా పర్మిషన్ ఇచ్చారు.
# అర్థరాత్రి 1 గంటకు, తెల్లవారు ఝామున 4 గంటలకు వేసిన షోలకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపునకు అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీఫ్లెక్స్ లో రూ.200 పెంపునకు అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీఫ్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు.
#డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్ లో రూ.20, మల్టీఫ్లెక్స్ లో రూ.50 పెంపునకు అనుమతి ఇచ్చారు..