అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల మధ్య పుతిన్ భారత పర్యటన..!

పుతిన్ త్వరలో భారతదేశంలో పర్యటిస్తారని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాస్కోలో ఉన్న ఆయన పర్యటన పూర్తి వివరాలను వెల్లడించలేదు…ట్రంప్ టారిఫే కారణమా?

రష్యాతో భారతదేశ వాణిజ్య సంబంధాలపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పుటిన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనడం ద్వారా ఉక్రెయిన్‌పై యుద్ధానికి భారతదేశం సహాయం చేస్తోందని, ఫలితంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పక్కదారి పడుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంతో భారత్ దిగుమతులపై అమెరికా అదనంగా 25 శాతం సుంకాన్ని విధిస్తోంది. భారతపై అదనపు సుంకాలను అమెరికా 50 శాతానికి పెంచింది..

గత ఏడాది ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ రెండుసార్లు కలిశారు.

అయితే ఇప్పటికే గత సంవత్సరం ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ రెండుసార్లు కలుసుకున్నారు. జూలైలో 22వ భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ మాస్కోకు వెళ్లిన సమయంలో ఒకసారి. అక్టోబర్‌లో కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైనప్పుడు రెండోసారి మోదీ, పుతిన్‌ సమావేశమయ్యారు.

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల మధ్య పుతిన్ భారత పర్యటన

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. భారత దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. శుక్రవారం నాటికి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి మాస్కో అంగీకరించకపోతే, రష్యన్ ముడి చమురు కొనుగోలుదారులపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు బెదిరించారు. దీంతో భారతదేశం రష్యా చమురు కొనుగోలుపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోదీ, పుతిన్ మధ్య ట్రంప్‌ తారిఫ్‌పై చర్చలు జరుగతాయని ప్రచారం జరుగుతోంది.