రాబిన్ హుడ్’ మూవీ రివ్యూ
నటీనటులు: నితిన్-శ్రీలీల-దేవ్ దత్త నాగె-రాజేంద్ర ప్రసాద్-షైన్ టామ్ చాకో- వెన్నెల కిషోర్-సిజ్జు-శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్
నిర్మాతలు: రవిశంకర్ యలమంచిలి-నవీన్ ఎర్నేని
రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల
‘భీష్మ’ చిత్రంతో మెప్పించిన జోడీ నితిన్-వెంకీ కుడుముల. మళ్లీ వీరి కలయికలో తెరకెక్కిన చిత్రం.. రాబిన్ హుడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి…
కథ:
రామ్ (నితిన్) ఒక అనాథ. తాను ఉంటున్న అనాథ శరాణలయానికి డబ్బుల సమస్య రావడంతో చిన్నతనంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెడతాడు. బడా బాబుల ఇళ్లలో డబ్బులు దోచుకుని తన లాంటి అనాథల కడుపు నింపుతుంటాడు. దీంతో తన పేరు రాబిన్ హుడ్ గా మారుతుంది. ఐతే విక్టర్ (షైన్ టామ్ చాకో) అనే పోలీస్ అధికారి తన మీద స్పెషల్ ఫోకస్ పెట్టడంతో రాబిన్ హుడ్ అప్రమత్తం అవుతాడు. కొన్నాళ్లు దొంగతనాలు మానేసి.. సెక్యూరిటీ ఏజెంట్ పనికి కుదురుతాడు. ఆస్ట్రేలియాలో ఒక పెద్ద కంపెనీ యజమాని తనయురాలైన నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వచ్చి వెళ్తుంటే.. ఆమె రక్షణ బాధ్యతలను రాబిన్ హుడ్ చేపడతాడు. ఐతే ఆమెను పనిగట్టుకుని రుద్రకొండ అనే ఊరికి రప్పిస్తుంది ఒక డాన్ గ్యాంగ్. మరి ఆ గ్యాంగ్ లక్ష్యం ఏంటి.. వారి నుంచి రాబిన్ హుడ్ ఆమెను కాపాడాడా.. ఈ ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
విశ్లేషణ: అన్నం పెట్టినవాళ్లను మరిచిపోకూడదు .. వాళ్లు ఆపదలో పడినప్పుడు విడిచిపెట్టకూడదు’ అనే కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. అలాగే దురాశ ఉన్నవాళ్లు దుర్మార్గులతో చేరతారు. ఆ దుర్మార్గులు చేసే పాపాల ఫలితాలను వాళ్ల చుట్టూ చేరినవారు కూడా అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేసిన కథ ఇది.
ఈ కథ ఆస్ట్రేలియా .. హైదరాబాద్ లను టచ్ చేస్తూ ‘రుద్రకొండ’లో జరుగుతుంది. విదేశాలలో ఉన్న హీరోయిన్ ను విలన్ రప్పించగా, అనుకోని విధంగా ఆమెతో హీరో జాయిన్ అవుతాడు. అలా హీరో – హీరోయిన్ – విలన్ డైరెక్టుగా బరిలోకి దిగుతారు. ఇక హీరో వైపు నుంచి రాజేంద్రప్రసాద్ .. హీరోయిన్ వైపు నుంచి వెన్నెల కిశోర్ కామెడీని పండించడానికి చేసిన ప్రయత్నం కొంతవరకూ ఫలించింది. .
సినిమా కు బలం అంటే వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే సంభాషణలు…కామెడీ ట్రాకే రాబిన్ హుడ్ సినిమాను నిలబెట్టింది. ఇక హీరో నితిన్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ శ్రీ లీల సంపన్న పారిశ్రామిక వేత్త కూతురిగా కనిపిస్తుంది. కానీ ఇందులో ఆమెకు దక్కింది ఏ మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కాదు. ఓన్లీ స్టైల్ గా..రిచ్ గర్ల్ గా కనిపిస్తుంది. జీ వి ప్రకాష తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా సినిమా ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రాబిన్ హుడ్ సినిమా లో డేవిడ్ వార్నర్ పాత్ర అలా వచ్చి ఇలా పోతుంది. ఓవరాల్ గా చూస్తే వెంకీ కుడుముల తన హిట్ ట్రాక్ కొనసాగించాడు అనే చెప్పొచ్చు. మరో వైపు నితిన్ కు ఈ సినిమా కాస్త ఊరట ఇచ్చినట్లే. మైత్రి మూవీ మేకర్స్ ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రాబిన్ హుడ్ లో తన మాటలతో దర్శకుడు వెంకీ కుడుముల ప్రేక్షకులను నవ్వించి…ఏ మాత్రం కొత్తదనం లేని కథ తో చేసినా సినిమాను బతికించుకున్నాడు అనే చెప్పాలి…