తెలుగు రాష్ట్ర లో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దీనికి ప్రధాన కారణమని తెలిపింది..ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
వాయువ్య బంగాళాఖాతంలోని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల మధ్య సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ వివరించింది. ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా.. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. బలమైన గాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది.
ముఖ్యంగా.. నేడు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి వంటి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ముఖ్యంగా నదులు, వాగుల పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయాలు కలిగే అవకాశం ఉన్నందున, బ్యాటరీతో నడిచే లైట్లు, ఫోన్ ఛార్జర్లు వంటి వాటిని సిద్ధం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసింది. సహాయక బృందాలను సిద్ధం చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేసింది. ప్రజలు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, స్థానిక అధికారులను లేదా విపత్తుల నిర్వహణ టోల్-ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు. రైతులు తమ పంటలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలను పాటించాలని సూచించారు. పొలాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు….
12 గంటల్లో అల్పపీడనం.. ఏపీ,, తెలంగాణలో పలు ప్రాంతాల్లో. భారీ వర్షసూచన
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీవర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగులు, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి వద్ద నిలబడవద్దని తెలిపారు.
నేడు శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
శుక్రవారం (జూన్ 27) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.
బుధవారం సాయంత్రం వరకు.. తూ.గో. జిల్లా నాగంపల్లెలో 49 మి.మీ వర్షపాతం నమోదవ్వగా.. విశాఖ రూరల్ 37.7 మి.మీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5 మి.మీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7 మి.మీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7 మి.మీ, సీతమ్మధారలో 35.5 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.