రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులొ ట్విస్ట్ లు.. షాకైన పోలీస్ లు.. !
Tejeshwar Case: గద్వాల జిల్లాలో తేజేశ్వర్ కేసు కూడా నేరకథ చిత్రాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. పైగా ఇందులో ఉన్న మలుపులు పోలీసులకు సైతం షాక్ కలిగిస్తున్నాయి..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన లైసెన్సుడు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును ఛేదించినట్లుగా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు..కెనరా బ్యాంకుకు అనుబంధంగా ఇండ్లు తదితర నిర్మాణాలకు సంబంధించి లోన్లు ఇచ్చే కెన్ ఫిన్ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్న తిరుమల్ రావు తన బ్యాంక్ లో స్వీపర్ గా పనిచేస్తున్న కర్నూలు పట్టణము లోని కల్లూరు కు చెందిన సుజాతకు లోన్ ఇవ్వడంతో పాటు.. ఆర్థిక అవసరాలు తీరుస్తూ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వివాహితుడు అయిన తిరుమల్ రావు సుజాత కూతురు ఐశ్వర్య తో పరిచయం పెంచుకొని ఆమెతోనూ వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య కు గద్వాల పట్టణానికి చెందిన తేజేశ్వర్ తో వివాహ నిశ్చయం జరిగింది. దీంతో తిరుమల్ రావు.. ఐశ్వర్య తమ సంబంధాన్ని కొనసాగించడం కష్టతరం కావడంతో.. తేజేశ్వర్ ను సుఫారి ఇచ్చి హతమారిస్తే తాము హాయిగా జీవించవచ్చు అనే నిర్ణయానికి వచ్చారని ఎస్పీ తెలిపారు.
ఈ మేరకు తిరుమల్ రావు కర్నూలుకు చెందిన కుమ్మరి నగేష్, చాకలి పరశురాముడు తో ఉన్న పరిచయాలతో తేజేశ్వర్ ను హతమార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు అని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా తేజేశ్వర్ తో పలుమార్లు భూముల సర్వేకు సంబంధించి మాట్లాడుతూ.. పరిచయాలు పెంచుకున్నారు. అడపదడపా గద్వాల వచ్చి పొలాలను చూసి వెళ్లేవారు. ఈ క్రమంలో తేజేశ్వరుని హతమార్చేందుకు సరైన అవకాశం దొరకలేదు. తేజేశ్వర్ ఎక్కడ ఉంటున్నాడు అన్న విషయం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా జిపిఎస్ ట్రాకర్ పరికరాన్ని ఆన్లైన్లో తెప్పించి తేజేశ్వర్ వాహనానికి రహస్యంగా అమర్చారు. తేజేశ్వర్ ఎప్పుడు ఎక్కడ ఏ ఊర్లో ఉంటున్నాడు అన్న విషయం గుర్తించడం సులభతరం అయింది. మే 18న తేజేశ్వర్ కు ఐశ్వర్యతో వివాహం జరిగింది. అప్పటినుండి తేజేశ్వర్ ను హతమార్చేందుకు నెల రోజులకు ఏపీ 39 యూ కే 3157 నెంబరు గల కారును అద్దెకు తీసుకున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 17న హత్య చేసేందుకు పథకం రచించి భూమి కొనుగోలు చేయాలి భూమిని చూపించండి అంటూ తేజేశ్వర్ కు ఫోన్ చేసి పరుశురాముడు, నగేష్, చాకలి రాజు గద్వాల వచ్చి తేజేశ్వర్ ను కారులో తీసుకెళ్లడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కారు లో పలు భూములు చూయించారని అప్పటికే మాటు వేసిన నిందితులు అప్పటికే కొనుగోలు చేసిన వేట కొడవలి, కత్తితో తో గొంతు కోసి హతమార్చారని ఎస్పీ తెలిపారు. అనంతరం శవాన్ని పలు ప్రాంతాలలో వేసేందుకు ప్రయత్నం చేయగా చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా పాణ్యం వద్ద ఘాట్ రోడ్ లోని గాలేరు నగరి కెనాల్ కాలువలో తెజేశ్వర్ శవాన్ని పడేసి వచ్చారాని ఎస్పీ తెలిపారు. ఈ హత్య చేయడానికి మేనేజర్ రెండు లక్షల రూపాయల నగదును వారికి అందజేసినట్లు గా ఎస్పీ వెల్లడించారు.
తేజేశ్వర్ ని చంపిన తర్వాత తిరుమల రావు, ఐశ్వర్య లు ఇద్దరు కలిసి లద్దాక్ లేదా అండమాన్ నికోబార్ కు వెళ్లాలని ప్లాన్ చేసారాని కానీ వారి ప్లాన్ ని జిల్లా పోలీస్ సిబ్బంది తిప్పికొడుతూ తక్కువ వ్యవధి లోనే నిందితులను అరెస్ట్ చేయడం తో జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు సఫలీకృతం ఐయ్యారని ఆయన సిబ్బందిని ప్రశంశించారు. ఈ హత్యకు ఉపయోగించిన రెండు ఎరుకల కొడవళ్లు, ఒక కత్తి, లక్ష ఇరవై వేల నగదు, 10 మొబైల్స్, ఒక జి పి ఎస్ ట్రాకర్, ప్రైవేటు వాహనం లో పారిపోతున్న వాహనం మహీంద్రా మారాజో (ఏ పి 39 టి ఏ 1715) వస్తువులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. అనంతరం ఎనిమిది మంది నిందితులను మీడియా ముందు ఎస్పీ శ్రీనివాస్ రావు ప్రవేశ పెట్టారు. ఈ కేసును తక్కువ సమయం లో ఛేదించినందుకు పోలీస్ సిబ్బందిని ఎస్పీ రివార్డ్ తో అభినందించారు. అనంతరం నిందుతులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం జరిగింది…
ఈ కార్యక్రమం లో డి ఎస్ పి మొగులయ్య, సీఐ శ్రీనివాస్ రావు, గద్వాల ఎస్ ఐ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ ఐ శ్రీకాంత్, దరూర్ ఎస్ ఐ కొండా శ్రీహరి, మల్థకల్ ఎస్ ఐ నందికర్, గట్టు ఎస్ ఐ మల్లేష్, ఐటీ సెల్ ఎస్ ఐ సుకుర్, స్వాతి, తేజేశ్వని ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
అసలు కథ ఇదే..!?
రుణం కోసం వచ్చిన వ్యక్తితో..
తేజేశ్వర్ ను అంతం చేయడానికి తన బ్యాంకుకు రుణం కోసం వచ్చిన నగేష్ అనే వ్యక్తితో తిరుమలరావు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. తన మొదటి భార్యను కూడా అంతం చేయాలని అతడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే మొదటి భార్యకు సంతానం లేకపోవడంతో ఆమెను హతమార్చి ఐశ్వర్యం రెండవ పెళ్లి చేసుకోవాలని తిరుమలరావు భావించాడు. అంతేకాదు బ్యాంకులో 20 లక్షల లోన్ కూడా తీసుకున్నాడు. ఐశ్వర్య ను వివాహం చేసుకున్న తర్వాత లడ్డాక్ ప్రాంతంలో నివాసం ఉండాలని అనుకున్నాడు. అంతకుముందే ఐశ్వర్య తల్లితో తిరుమలరావుకు వివాహేతర సంబంధం ఉంది. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఐశ్వర్య కు దగ్గరయ్యాడు. ఆశ్చర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. కానీ ఈ లోగానే ఐశ్వర్య తల్లి తేజేశ్వర్ తో సంబంధం కుదిర్చింది. అంతేకాకుండా తిరుమల రావు తోనే ఆమె తన సంబంధాన్ని కొనసాగించాలని భావించింది. అయితే ఈ విషయం తిరుమలరావుకు ఆలస్యంగా తెలిసింది. దీంతో ఐశ్వర్యను అతడు నిలదీశాడు. తేజేశ్వర్ తో వివాహం కుదిరిన తర్వాత.. ఐశ్వర్య తిరుమలరావుతో ఐదు రోజులపాటు వెళ్లిపోయింది. ఐదు రోజుల వారిద్దరు దూర ప్రాంతాలకు వెళ్లిపోయారు.. చివరికి ఐశ్వర్య వివాహం తేజేశ్వర్ తో జరిగింది. వివాహం జరిగిన నెల రోజుల్లోనే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది.
జిపిఎస్ అమర్చింది
తేజేశ్వర్ రాకపోకల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అతని వాహనానికి జిపిఎస్ పరికరాన్ని ఐశ్వర్య అమర్చింది. అతడి గురించి ఎప్పటికప్పుడు తిరుమల రావుకు తెలియజేసింది. తిరుమలరావు తో ఏకంగా 2000 సార్లు ఐశ్వర్య మాట్లాడింది. పోలీసులకు కాల్ డాటా కీలక ఆధారంగా లభించింది. దీని ద్వారా వారు విచారణ సాగించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే తేజేశ్వర్ అంతమైన తర్వాత తిరుమలరావు పరారీలో ఉన్నాడు. అతని జాడను పోలీసులు కనుగొన్న తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు అతడు చెప్పిన వివరాలను కూడా నమోదు చేసుకున్నారు. మొత్తంగా ఐశ్వర్య, తిరుమల రావు అత్యంత పాశవికంగా తేజేశ్వర్ ను అంతం చేశారు..