ఏపీ, తెలంగాణకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్..
ఏపీలో 9 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్..
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లికి గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ,,అల్లూరి, మన్యం జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్..
తెలంగాణలో 4 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్..
భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేటకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్..
మహబూబ్‌నగర్ జిల్లాకు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరిక..
రేపు సాయంత్రంలోగా ఆకస్మిక వరదలకు అవకాశం..
ఒడిశాలో 5 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్..
ఛత్తీస్‌గఢ్‌లో 3 జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్..
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైడ్రా, పోలీస్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.రోడ్లు, ప్రధాన జంక్షన్లలో నీరు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు…
సమన్వయంతో పనిచేయాలని సూచన..
హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా (HYDRA), పోలీసు కమిషనర్లు కో-ఆర్డినేషన్‌తో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. నగరంలో వర్షం కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే స్పందించేలా యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలన్నారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే సిబ్బందిని, యంత్రాలను రంగంలోకి దించాలని ఆదేశించారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నాలాలు, డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు.
విద్యుత్, ట్రాఫిక్ నివారణకు ముందస్తు చర్యలు
నగరంలో వర్షం వేళ విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీలో తక్షణమే స్పందించేందుకు సహాయక బృందాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అప్రమత్తంగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.