ఆంధ్రప్రదేశ్, Andhra Pradesh తెలంగాణ Telangana రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు వాతావరణంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఇరు రాష్ట్రాల్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో ఉమ్మడి వరంగల్, worangala కరీంనగర్, నల్గొండ Nalgonda, ఖమ్మం, నిజామాబాద్ nijamabad జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరుతో పాటు కోస్తాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.