భారత కుర్రాడిపై లంక మాజీ మేనేజర్ ఓవరాక్షన్..చదువు, సంస్కారం లేదు.. పక్కా పల్లెటూరోడు.. వైభవ్ పై నోరు పారేసుకున్న లంక మేనేజర్..

ఆటగాళ్ల మధ్య గొడవలు, స్లెడ్జింగ్ సహజమే అయినప్పటికీ ఒక్కోసారి అవి హద్దులు దాటి పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ Vaibhav Suryavanshi ఆట కంటే ఎక్కువగా తన ప్రవర్తనతో నెగటివ్ వార్తల్లో నిలిచాడు. ఇండియా-ఎ India A తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాడితో గొడవకు దిగడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ CRICKET వర్గాల్లో తీవ్ర చర్చలు సాగుతున్నయి…శ్రీలంక-ఎ Sri Lanka A జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇండియా-ఎ టీమ్ సూపర్ ఓవర్‎లో SUPER OVER ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయానంతరం శ్రీలంక ఆటగాళ్లు ఆనందంతో జోష్ లో ఉంటూ భారత ఆటగాళ్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో శ్రీలంక ఆటగాళ్లు కొంత నోటి దురుసు మీడియా వాళ్ళకి చిక్కలేదు కానీ వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయి ప్లేయర్లపై దూసుకు వెళ్ళింది మాత్రం స్పష్టంగా కనబడుతుంది.., లంక ఆటగాడి దగ్గరకు వెళ్లి అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. దీనికి ప్రతిగా సదరు శ్రీలంక ఆటగాడు కూడా వైభవ్‌ను వెనక్కి నెట్టడంతో మైదానంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకుని ఆటగాలను విడదీశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానంలో ప్రత్యర్థి ప్లేయర్లను నెట్టడం తీవ్రమైన నేరం కాబట్టి, వైభవ్‌పై నిషేధం పడే అవకాశం ఉంది… కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాదం తారాస్థాయికి చేరుతుంది…

భారత కుర్రాడిపై లంక మాజీ మేనేజర్ Sri Lanka ex-manager ఓవరాక్షన్..

ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ బ్రయాన్ థామస్ brain Thomas సోషల్ మీడియా వేదికగా అత్యంత దారుణమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ప్రవర్తనను తప్పుబడుతూ.. “నేను ఇప్పుడే సూర్యవంశీ అహంకారాన్ని వీడియోలో చూశాను.చదువు, సంస్కారం లేదు.. పక్కా పల్లెటూరోడు.. వైభవ్ పై నోరు పారేసుకున్న లంక మేనేజర్ క్రికెట్‌లో రెడ్ లేదా ఎల్లో కార్డ్ లేకపోవడం విచారకరం. మ్యాచ్ రెఫరీ ఈ కౌబాయ్ (గొర్రెల కాపరి)ని తదుపరి మ్యాచ్ ల నుంచి సస్పెండ్ చేస్తేనే బుద్ధి వస్తుంది” అని రాసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత అతడు చేసిన వ్యాఖ్యలు భారతీయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి….

సోషల్ మీడియాలో మరికొందరు శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ బ్రయాన్ థామస్ మండిపాటు… ఇటీవల జట్టు లో సెలెక్ట్ అయిన ఆటగాడు వైభవ్ సూర్యవంశి కొన్ని నిబంధనలు తెలియకపోవచ్చు. శ్రీలంక ఆటగాళ్ల స్లెడ్జింగ్ తో ఆవేశం రావచ్చు ,, ఆ సమయంలో ఏం జరిగిందో తెలియకుండా సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టడం ఏంటంటే ఆగ్రహం వ్యక్తం క్రికెట్ అభిమానులు…