రైతుబంధు లబ్ధిదారులకు ముఖ్యమైన అంశాలు..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేదీ 26.01.2025 నుండి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద, ప్రతి అర్హుడైన రైతుకు సంవత్సరానికి ₹12,000 పెట్టుబడి సాయం అందించబడుతుంది.

ముఖ్యమైన అంశాలు:.

1.రైతుబంధు లబ్ధిదారులు..

ఇప్పటికే రైతుబంధు పథకం లబ్ధిదారులుగా ఉన్న రైతులు, ఈ పథకానికి కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
2.బ్యాంకు వివరాల మార్పు:.
రైతు తన బ్యాంకు వివరాలను మార్చుకోవాలనుకుంటే, తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి.
3.*అర్హత:
2025 జనవరి 1వ తేదీ వరకు కొత్త పట్టా పాస్ బుక్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.
4.*నూతన అప్లికేషన్లు*:
అర్హులైన వారు, వారి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారికి అప్లికేషన్ ఇవ్వగలరు.
అప్లికేషన్ తో పాటు పొందపరచవలసిన పత్రాలు:
• పట్టా పాస్ బుక్ ప్రతులు
• ఆధార్ కార్డు
• బ్యాంక్ ఖాతా వివరాలు.
రైతు భరోసా పథకం పై మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, సమీప వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయాన్ని సంప్రదించగలరు.