పాక్‌లోని ప్ర‌తి అంగుళం.. బ్ర‌హ్మోస్ రేంజ్‌లో….రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్..

పాక్ లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్ లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే..

యూపీ రాజధాని లఖన్ వూలోని బ్రహ్మోస్ ఏరో స్పేస్ యూనిట్ ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

తొలివిడత బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించిన రక్షణ మంత్రి…..

. ల‌క్నోలోని స‌రోజిని న‌గ‌ర్‌లో ఉన్న బ్ర‌హ్మోస్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని సంద‌ర్శించిన రాజ్‌నాథ్ అక్క‌డ మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ సైనిక బ‌ల‌గాల‌కు బ్ర‌హ్మోస్ ఓ పిల్లర్‌లా మారింద‌న్నారు. ఇది దేశ విశ్వాస సామ‌ర్థ్యాన్ని పెంచింద‌న్నారు. క‌ల‌ల‌ను నిజం చేసే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. బ్ర‌హ్మోస్ ఏరోస్పేస్‌లో త‌యారీ అయిన ఫ‌స్ట్ బ్యాచ్ క్షిప‌ణ‌ల‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ ప‌చ్చ‌జెండా ఊపారు. ఈ కార్య‌క్ర‌మంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పాల్గొన్నారు..బ్ర‌హ్మోస్ ఏరోస్పేస్ నుంచి ఫ‌స్ట్ బ్యాచ్ మిస్సైల్ సిస్ట‌మ్ విజ‌య‌వంతంగా త‌యారీ అయ్యిన‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. బ్ర‌హ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను మే 11వ తేదీన ప్రారంభించారు. మిస్సైల్ ఇంటిగ్రేష‌న్‌, టెస్టింగ్‌, ఫైన‌ల్ క్వాలిటీ చెకింగ్‌కు కావాల్సిన అన్ని ఆధునిక స‌దుపాయాలు ఉన్నాయి. విజ‌య‌వంతంగా టెస్టింగ్ జ‌రిగిన త‌ర్వాత‌, ఆ మిస్సైళ్ల‌ను భార‌త సైనిక ద‌ళాలు మోహ‌రించ‌నున్నాయి. ల‌క్నోలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి డిప్యూటీ సీఎం బ్ర‌జేశ్ పాత‌క్‌, మంత్రినంద గోపాల్ గుప్తా నంది, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు..