రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన అలీ…

సినిమా పరిశ్రమలో సీనియర్ నటుడిగా, కామెడీ కింగ్‌గా పేరొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే….ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, ఈ వివాదంపై కమెడియన్ అలీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, రాజేంద్ర ప్రసాద్‌ను సమర్థిస్తూ మీడియాను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు..ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి అనుచిత పదజాలంతో మాట్లాడిన వీడియో వైరల్ కావడంతో, అలీ ఈ విషయంపై స్పందిస్తూ, “నిన్న కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారికి మాట తూలింది. సరదాగా అన్నారు, దీన్ని తీసుకుని మీడియా మిత్రులు వైరల్ చేస్తున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్, ఆయన దుఃఖంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆయనకు అమ్మ లాంటి కూతురు చనిపోయింది. అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. కావాలని ఈ విషయంలో రచ్చ చేయకండి, ఆయన పెద్దాయన,” అని అన్నారు..

అలీ ఈ స్పందనలో రాజేంద్ర ప్రసాద్‌ను సమర్థిస్తూ, ఆయన వ్యాఖ్యలు సరదాగా చేసినవేనని, దాన్ని అతిగా పెద్దది చేయొద్దని మీడియాను కోరారు. అలాగే, రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన కుమార్తె గాయత్రి మరణంతో (అక్టోబర్ 5, 2024) భావోద్వేగ స్థితిలో ఉన్నారని, ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని సూచించారు…

రోజా గురించి కూడా నోరు జారారు..

కమెడియన్ అలీని ఉద్దేశిస్తూ ఓ బూతు మాట వాడారు. ఇదే వేడుకలో నటి, మాజీ మంత్రి రోజా గురించి కూడా నోరు జారారు. దాన్ని హీరోయిన్ చేసింది నేనే అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ దబాయింపు రీతిలో మాట్లాడారు.

స్టేజీ ఎక్కితే చాలు కొందరు నటులకు నోరు జారుతుంటారు. అలాంటి వాళ్లలో రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఈ ఏడాది మార్చిలో ‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది. ఈ మూవీలో అతిథి పాత్రలో నటించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని ఉద్దేశిస్తూ.. ము** కొడకా అని రాజేంద్ర ప్రసాద్ సంబోధించారు. తర్వాత క్షమాపణ చెప్పారు. ఇప్పుడు అలీని ఏకంగా బూతు మాట ఉద్దేశించి పిలిచారు. రోజా గురించి కూడా నోరు పారేసుకున్నారు. ఈ వీడియోలన్నీ వైరల్ కావడంతో రాజేంద్ర ప్రసాద్‌పై విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ‘షష్టిపూర్తి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ సోమవారం జరిగాయి. దీనికి హాజరైన రాజేంద్ర ప్రసాద్.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ఈ మధ్య ఫంక్షన్లలో నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ ఖర్మ. మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నేనేం చేయలేను. నేనైతే ఇట్లానే సరదాగా ఉంటాను’ అని చెప్పుకొచ్చారు.