రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్..
తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిల్లులు ఆమోదం పొందకపోవడం గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారు, అదే సమయంలో తాను ఎవరినీ విమర్శించడం లేదని అన్నారు…ఎమ్మెల్యే ఇటీవల పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ప్రత్యక్ష వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన కలిగించాయి.
రెండు రోజుల కింద జరిగిన ఈ సీక్రెట్ మీటింగ్ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రేవంత్ రెడ్డికి చేరినట్లు సమాచారం
ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తుంది
గతంలో సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్న కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మీటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి మీటింగ్తో సర్వత్రా ఉత్కంఠ..