మంత్రి పదవి పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

*యాదాద్రి భువనగిరి జిల్లా*

చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం లో మంత్రి పదవి పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాయిస్…

https://youtu.be/abheLpIPXv8
*ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. *

* పదవి అనేది అలంకారం కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి
* రాబోయే రోజుల్లో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ పరిధిని పెంచి రైతులకు ఇంకా మంచి చేసే కృషి చేస్తా.
* ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న సంకల్పం తోటి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది.
* ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నపుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
* గతంలో పాలించిన పార్టీ ఒక కుటుంబ పార్టీ, రాచరికంతో కొనసాగిన పార్టీ , వారికి వంగి వంగి దండాలు పెట్టిన వారికె మంత్రి పదవులు ఇచ్చారు.
* కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ
* కరెంటు గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కరెంటు అంటేనే కాంగ్రెస్ పార్టీ.
* రైతు రుణమాఫీ కొంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది అది వాస్తవమే.
* డబల్ బెడ్ రూమ్ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పేదలను మోసం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తుంది.
* పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పాలయ్యారు.
* మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి నీరు అందించే బాధ్యత రాజగోపాల్ రెడ్డి దే.
* ప్రభుత్వం పెట్టిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుంది.
* మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి హామీ ఇస్తానని మళ్ళీ హామీ వాస్తవమే.
* *నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటం కాదు ఒక బాధ్యతగా వ్యవహరిస్త*

* *నాలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధేస్తుంది*
* ఒకాయన అంటాడు ఒక ఇంట్లో ఇద్దరి మంత్రి పదవులు ఇస్తామని, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్లో యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్ ఇద్దరు అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహిస్తే లేనిదే మంత్రి పదవులు ఇద్దరు ఇస్తే తప్పా.
* మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది, కాదు కెపాసిటిని బట్టి వస్తుంది.

* 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానరెడ్డి కి ఈరోజు రంగారెడ్డి, హైదరాబాద్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకు వచ్చింది.
* హైదరాబాద్, మహబూబ్నగర్, మెదక్ లాంటి జిల్లాల్లో మంత్రుల కు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన ఎంపి లు గెలవలేదు, భునగిరిలో ఒక ఎమ్మెల్యేగా నేను గెలిపించా.
* కెసిఆర్ ను పెద్దదింపాలని లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కేసీఆర్ ను గద్దె దింపిన. అది నా కమిట్మెంట్.
* నా మంత్రి పదవి విషయంలో కొందరు దుర్మార్గులు జానా రెడ్డి లాంటి వ్యక్తులు ధృతరాష్ట్ర పాత్ర పోషిస్తున్నారు.
* రాజగోపాల్ రెడ్డి అంటే గల్ల ఎగరేసుకొని ఉంటాడే తప్పా అడుక్కునే పొజిషన్లో ఉండడు.