ప్రకృతిని, పూలని పూజించే గొప్ప సంసృతి మన రాష్ట్రానిది… మాజీ మంత్రి హరీష్ రావు.

సిద్దిపేట జిల్లా పదేళ్ళ పండుగ సందర్భంగా కోమటి చెరువు మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ లో లేజర్ షో, బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరు కావడం జరిగింది..

ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

ఎన్నో ఏండ్ల సిద్దిపేట జిల్లా కలను 2016 లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేశారు.

సిద్దిపేటకు గోదావరి జలాలు రాకముందు బతుకమ్మ కుంటల నీళ్లు లేకపోతుండే కానీ ఎప్పుడైతే కాలేశ్వరం తో గోదావరి జలాలు సిద్దిపేటకు వచ్చాయో అప్పటినుంచి ఎక్కడ చూసినా నీళ్లే..

రైతు మార్కెట్ కోసం అయినా విద్య కోసమైనా వైద్యం కోసమైనా సిద్దిపేట ఒక మోడల్ గా నిలిచింది.

ఒకప్పుడు సిద్దిపేట పందులు మురికి కాలువలకు నిలయంగా ఉండేది.

ఇప్పుడు అండర్ డ్రైనేజీ సిస్టం, చెరువులు కాలువతో కళకళలాడుతుంది.

మన ప్రభుత్వం దురదృష్టవశాత్తు పోయింది. లేకపోతే ఒకవైపు శిల్పారామం, మరోవైపు కోమటి చెరువు ఉండేది..

అయినా మళ్ళీ మన టైం వస్తుంది.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. రాకెట్ స్పీడ్ లో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుందాము

బతుకమ్మ పండుగ అంటే మనకు స్పెషల్..

ఈ పండుగ మీ జీవితంలో మంచి తేవాలని కోరుకుంటున్నాను.

దేశంలోని 28 రాష్ట్రాల్లో బతుకమ్మ ఎక్కడ ఆడతారంటే తెలంగాణ అని చెప్తారు.

ప్రకృతిని, పూలని పూజించే గొప్ప సంసృతి మన రాష్ట్రానిది.

నన్ను బతుకమ్మకు దుబాక్ కు రమ్మని, అమెరికాకు రమ్మని పిలుస్తూ ఉంటారు

కానీ నాకు దుబాయ్ అమెరికా అంటే మన సిద్దిపేటనే.. మన కోమటిచెరువు మీద బతుకమ్మ జరుపుకుంటేనే నాకు ప్రత్యేకం.

సిద్దిపేట జిల్లాకు రేపటితో పదేళ్లు.. అందరం ఘనంగా ఈ పదేళ్ల పండుగను జరుపుకుందాం.

రాబోయే రోజుల్లో అందరూ అమ్మవారి దయతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.