చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి

రంగారెడ్డి జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనలో 17కు చేరిన మృతుల సంఖ్య.

చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ..
https://x.com/r9telugunews/status/1985188504251379803
ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు, 17 మంది మరణించినట్లు సమాచారం.

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుపుతున్న అధికారులు..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుని కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో టిప్పర్‌ డ్రైవర్‌తో పాటు 17 అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో 15 నెలల చిన్నారి ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చాలా మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు….

బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూడు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులోనుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఉదయం రోజువారీగా విద్యార్థులు, ఉద్యోగులు హైదరాబాద్ వెళ్తుంటారు. కొంతమంది ఆదివారం సెలవు రావడంతో సొంతూర్లకు వెళ్లి తిరిగి ప్రయాణమయ్యారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్, బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా చోటుచేసుకుంది..

తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కాలేజీల్లో చదువుతున్నట్లు సమాచారం. బస్సుపై టిప్పర్‌ పడిపోవడంతో డ్రైవర్‌ వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రయాణికుల ఆర్తనాలతో ప్రమాద స్థలం హృదయవిదారకంగా మారింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలానికి అంబులెన్స్‌కు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది..