బంతుల్లోనే అంతా మారిపోయింది.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఇదే!
ట్రోఫీ సాధించాలనే పూర్తి కసితో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఈసారి కప్ మనదే అని దూసుకెళ్తున్న బెంగళూరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ వేసింది..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 42 పరుగుల తేడాతో గెలుపొందింది…
లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ విజయం సాధించడం విశేషం. 42 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే చేరుకున్న బెంగళూరుకు మాత్రం ఈ ఓటమి మింగుడు పడని విషయం.
లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ విజయం సాధించడం విశేషం. 42 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ప్లేఆఫ్స్‌కు ఇప్పటికే చేరుకున్న బెంగళూరుకు మాత్రం ఈ ఓటమి మింగుడు పడని విషయం..
సన్‌రైజర్స్ విధించిన భారీ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక బంతి మిగిలి ఉండగానే 189 పరుగులకు ఆలౌటైంది. ట్రోఫీపై పూర్తి కసితో ఉన్న బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ పోరాటం చేయలేకపోయారు. సాల్ట్ 32 బంతుల్లో 62 పరుగులు చేసి మంచి ఆరంభం ఇవ్వగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా 43 పరుగులతో మంచి ఓపెనింగ్స్ ఇచ్చాడు. అయితే తదుపరి వచ్చిన బ్యాటర్లు దాన్ని కొనసాగించలేకపోయారు. మయాంక్ అగర్వాల్ (11), ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రజత్ పాటిదార్ 18 పరుగులే చేశాడు. కెప్టెన్ జితేశ్ శర్మ 24 పరుగులు చేయగా.. షెఫర్డ్ డకౌటయ్యాడు. అప్పటికే ఓటమి ఖరారు చేసుకోగా.. కృనాల్ పాండ్యా (8), టిమ్ డేవిడ్ (1), భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ (3) పరుగులు చేయలేక వరుసగా మైదానం వీడారు..
మలుపు తిప్పిన నితీష్, ఇషాన్
14 ఓవర్లలోనే 163 పరుగులు చేయడంతో ఆర్సీబీ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ 15వ ఓవర్ వేసిన నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగులే ఇచ్చి ఆర్సీబీ బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో ఇషాన్ మలింగా వేసిన మరుసటి ఓవర్లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. రజత్ పటీదార్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటవ్వగా.. డేంజరస్ రొమారియో షెపెర్డ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దాంతో ఆర్సీబీ మరింత ఒత్తిడికి గురైంది. చేధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా పెవిలియన్ చేరారు. జితేశ్ శర్మ(24)ను ఉనాద్కత్ ఔట్ చేయగా.. టీమ్ డెవిడ్‌ను ఇషాన్ మలింగా, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాలను కమిన్స్ ఔట్ చేశాడు. యశ్ దయాల్‌ను హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చి ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.