ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి శుభారంభాన్ని ఇచ్చింది. డిఫెడింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైర్స్ పై 7 వికెట్ల తేడాతో భారీ విజయం అందుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆర్సిబీ 16.2ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో దుమ్మురేపాడు. ఫిల్ సాల్ట్ 31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సెక్సులతో ఉతికారేసాడు. ఈ ఇన్నింగ్స్ తో కోల్ కతాపై కోహ్లీ 1000 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే విరాట్ ఐపీఎల్ లో ఓ అరుదైన రికార్డు ను అందుకున్నాడు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మొదటి మ్యాచ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించి…. గుడ్ బిగినింగ్ అందుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు విరాట్ కోహ్లీ అలాగే ఫిలిప్ సాల్ట్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించడంతో కేకేఆర్ జట్టుపై అవలీలగా విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. చేజింగ్ ఆరంభం నుంచి… రఫ్ ఆడించిన విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అలాగే సాల్ట్ ( Philip Salt).. బెంగళూరును విజయతీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. చివరి వరకు ఆడిన కోహ్లీ… జట్టును విజయతీరాలకు చేర్చాడు. 22 బంతులు మిగిలి ఉండగానే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 59 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు కోహ్లీ. ఇది ఇలా ఉండగా… అంతకు ముందు టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore team ) … మొదట బౌలింగ్ తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే బౌలర్లు కూడా అద్భుతంగా బౌల్ చేశారు. దీంతో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు సొంత గడ్డపై కూడా పెద్దగా రాణించలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 174 పరుగులు మాత్రమే చేసింది కోల్కతా నైట్ రైడర్స్. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో.. తక్కువ స్కోరు చేసింది. కోల్కత్తా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) బ్యాటర్లలో సునీల్ నరైన్ 44 పరుగులు చేసి దుమ్ము లేపగా… కెప్టెన్ అజింక్య రహానే 56 పరుగులతో రాణించాడు.
మిడిల్ ఆర్డర్లో కొత్త కుర్రాడు రఘువంశీ 30 పరుగులు టచ్ లోకి వచ్చాడు. కానీ చివరి వరకి రఘువంశి ఆడక పోవడంతో కేకేఆర్ తక్కువ పరుగులు చేసింది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) … పెట్టిన 175 పరుగుల లక్ష్యాన్ని… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అవలీలగా చేదించింది. ఏమాత్రం భయపడకుండా బ్యాటర్లు… కోల్కత్తా నైట్ రైడర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో మొదటి విక్టరీ నమోదు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.