రిలయన్స్ జియో, రూ.399 రీఛార్జ్ ప్లాన్‌తో 12 నెలల పాటు ఉచితంగా ఈ ఫీచర్..!

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది జియో వినియోగదారులకు ప్రొఫెషనల్ స్థాయి డిజైన్ అనుభూతిని అందించేందుకు రిలయన్స్ జియో , ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ కాన్వా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్లు, పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపార యజమానులు తమ సృజనాత్మకతను మరింత మెరుగుపరుచుకోవడానికి వీలుంటుంది. డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న జియో, తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. అర్హత కలిగిన జియో వినియోగదారులు మైజియో యాప్ ద్వారా ఈ అద్భుతమైన ఆఫర్‌ను ఎటువంటి హిడెన్ ఛార్జీలు లేకుండా సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

కాన్వా ప్రయోజనాలు…వినియోగదారులు ఎంచుకునే జియో రీఛార్జ్ ప్లాన్‌ను బట్టి కాన్వా ప్రయోజనాలు మారుతుంటాయి. నివేదికల ప్రకారం, వినియోగదారులకు లభించే కాన్వా ప్రయోజనం వారు ఎంచుకునే ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. రూ.399 రీఛార్జ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు పూర్తిస్థాయి ‘ కాన్వా ప్రో ‘ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా 12 నెలల పాటు ఉచితంగా లభిస్తాయి.మరోవైపు, రూ.349 ప్లాన్ , రూ.349 కంటే ఎక్కువ ధర గల రోజువారీ 2GB ప్లాన్‌లను ఎంచుకునే వారికి ‘కాన్వా ప్రో లైట్’ 12 నెలల పాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో ఈ కాన్వా ప్రయోజనం మొత్తం విలువ సుమారు రూ. 4,000 వరకు ఉంటుందని కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి.

కాన్వా ప్రో, ప్రో లైట్ మధ్య తేడాలు…

కాన్వా ప్రో, ప్రో లైట్ రెండూ లక్షలాది ప్రీమియం టెంప్లేట్లు, ఫోటోలు, వీడియోలు, ఫాంట్‌లకు వినియోగదారులకు పూర్తి యాక్సెస్‌ను అందిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ రీసైజ్, మ్యాజిక్ ఎరేజర్ వంటి అత్యంత ఉపయోగకరమైన అధునాతన ఫీచర్లు ఈ రెండు వెర్షన్‌లలోనూ అందుబాటులో ఉంటాయి. అయితే, కాన్వా ప్రో లైట్ మూడు బ్రాండ్ కిట్‌లతో పాటు 50GB క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తుండగా, కాన్వా ప్రో ఐదు బ్రాండ్ కిట్‌లు, 100GB క్లౌడ్ స్టోరేజ్‌ను అందిస్తుంది.

అంతేకాకుండా, కాన్వా ప్రోలో సోషల్ మీడియా పోస్ట్‌లను ముందుగానే షెడ్యూల్ చేయడానికి కంటెంట్ ప్లానర్, అధునాతన ఏఐ టూల్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు అదనంగా లభిస్తాయి. హిందీతో సహా పలు ప్రాంతీయ భారతీయ భాషలకు కాన్వా మద్దతు ఇస్తుండటం దేశంలోని సాధారణ వినియోగదారులకు మరింత ప్రయోజనకరంగా మారుతుంది.