అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రచారాలలో ఒకటి రిజర్వేషన్‌ హటావో …!

ఇప్పుడు అదే ఫార్ములాతో మరో కొత్త రచ్చ సోషల్ మీడియా తలుపు తట్టింది. అదే ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ (ఆర్.హెచ్ఏ).. మాకూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదంటూ బరిలోకి దిగిన ఈ ఆజ్ఞాత గ్రూప్.. పేజీ పెట్టిన కొన్ని రోజులకే ఏకంగా 39 లక్షల ఫాలోవర్లను ఖాతాలో వేసుకుని డిజిటల్ దుమ్మురేపుతోంది… ఇటీవల అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రచారాలలో ఒకటి రిజర్వేషన్‌ హటావో ఆందోళన్‌(ఆర్‌హెచ్‌ఏ). దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లను అంతం చేయాలని పిలుపునిస్తున్న ఈ ఉద్యమం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నడుస్తున్నది. దీని ఖాతా దాదాపు 50 లక్షల మంది ఫాలోవర్లను చేరుకుందని సమాచారం. దీంతో ఇది ఆ ప్లాట్‌ఫారమ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన కొత్త సమస్య ఆధారిత డిజిటల్‌ ప్రచారాలలో ఒకటిగా నిలిచింది..ఆర్‌హెచ్‌ఏ ప్రచారం ఏమిటి?
రిజర్వేషన్‌ హటావో ఆందోళన్‌ అనేది దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్‌ను వ్యతిరేకించే ఒక సోషల్‌ మీడియా ప్రచారం. కళాశాలల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు కులం ఆధారంగా కాకుండా ప్రతిభ, మార్కులు, సామర్థ్యం ఆధారంగా జరగాలని ఈ ప్రచార మద్దతుదారులు వాదిస్తున్నారు. ఆర్థికంగా బలహీన వర్గాల నుండి వచ్చిన విద్యార్థులు, యువతకు ఆర్థిక సహాయం అందించాలని కూడా ఈ ప్రచార నిర్వాహకులు, మద్దతుదారులు కోరారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చదువుకోవడానికి, తమ వృత్తిపరమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి అవకాశాలు పొందేలా ప్రభుత్వ సహాయం అనేది ఆర్థిక అవసరాల ప్రాతిపదకన ఉండాలన్నది వారి వాదన.