రేవంత్‌కు ప్రధాని మోదీ ఆఫర్.!

రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన నరేంద్ర మోడీ

కాంగ్రెస్ పార్టీలో నువ్వు అనుకున్న స్థానానికి చేరుకోలేవు నాతో కలవు – నరేంద్ర మోడీ…

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా “మేరే సే జోడో” (నాతో జతకట్టండి) అనే మాట మార్మోగిపోతోంది. ప్రధాని మోదీ చేసిన “మేరే సే జోడో” కామెంట్స్‌ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. హైదరాబాద్‌లోని HICCలో రూ. 9,377 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది..సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి పూర్తి సహకారం అందించారని గుర్తుచేశారు. అదే తరహాలో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. దీనికి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ, రేవంత్ వ్యాఖ్యలను చాలా చాకచక్యంగా తిప్పికొట్టారు. “నాడు గుజరాత్‌కు అందిన నిధుల కంటే, నేడు తెలంగాణకు రెట్టింపు నిధులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, రేవంత్ చెప్పినట్టు గుజరాత్ తరహాలోనే నిధులు ఇస్తే తెలంగాణకు ఇప్పుడు వస్తున్న దానిలో సగమే వస్తాయని” మోదీ చమత్కరించారు…

సీఎం గారూ.. ఇది వింటున్నారా?”.

తెలంగాణకు కేంద్రం కేటాయిస్తున్న నిధులపై ప్రధాని మోదీ గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. “రేవంత్‌రెడ్డి గారూ, ఇది వింటున్నారా?. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రైల్వే బడ్జెట్‌లో కనీసం రూ.1,000 కోట్లు కూడా దక్కేవి కావు. కానీ నేడు ఒక్క తెలంగాణకే రూ.5,500 కోట్లు కేటాయించాం. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల రైల్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయి” అని పేర్కొన్నారు. తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్, 6 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇచ్చామని గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రకు, తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ‘హాత్ సే హాత్ జోడో’ కార్యక్రమానికి కౌంటర్‌గా ప్రధాని మోదీ ఈ పదాన్ని ప్రయోగించడం గమనార్హం. అయితే తెలంగాణ ప్రగతి కోసం కేంద్రంతో కలిసి నడవాలని, రాష్ట్రానికి అవసరమైన సహాయం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తే, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కేంద్రంతో సఖ్యతగా ఉండటాన్ని బీజేపీ తనకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..