విశాఖ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.
పెందుర్తి-ఆనందపురం రహదారిపై లారీని ఢీకొన్న కారు.
నలుగురు మృతి, ఒకరికి తీవ్రగాయాలు.
మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేట వాసులు.
అనకాపల్లి
ఆనందపురం జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారిలో గండిగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. బాధితులు టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం-విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి కారులో శ్రీకాకుళం జిల్లాకు ఓ ఫ్యామిలీ వెళ్తోంది. టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తోంది..
లారీని ఢీ కొట్టిన కారు-అయితే కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి బలంగా లారీని ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. కారు డ్రైవర్ సహా నలుగురు స్పాట్లో మృతి చెందారు. నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ గాయపడినట్టు తెలుస్తోంది.
స్పాట్లో నలుగురు మృతి-ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే పీఏను చికిత్స కోసం విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చంద్రశేఖర్ కొడుకు ఉన్నట్ల్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, వివరాలు సేకరించారు.