కొండా సురేఖ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు…బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం…

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గురుకులాలపైనా, వ్యక్తిగతంగా తనపైనా మతిస్థిమితం లేని వ్యా ఖ్యలు చేశారని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి, బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ అంటే బీర్లు, బిర్యానీ ఉండాల్సిందేనని గతంలో వ్యాఖ్యానించిన ఆమె తన చిత్తశుద్ధిని శంకిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మంది పోలీసులను పెట్టినా బీఆర్‌ఎస్‌ చేపట్టిన గురుకుల బాట ఆగబోదని స్పష్టంచేశారు….కొండా సురేఖ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. విద్యాలయాల్లో విషాహార సం ఘటనలు ఎందుకు జరుగుతున్నయి? వాటి నివారణ చర్యలు తీసుకోకుండా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, పిల్లలలో కలిసి తినకుండా, పాఠశాలలకు వెళ్లకుండా గాంధీభవన్‌లో కూర్చొని అందు లో నా కుట్ర ఉన్నదని చెప్పడం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యను పక్కదారి పట్టించడమే అవుతుంది. నేను గురుకులాల కార్యదర్శిగా 9 ఏండ్లు పనిచేసిన. అందులో రెండేండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఏడేండ్లు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. కేసీఆర్‌ ప్రోత్సాహంతో గురుకులాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ అయి న హార్వర్డ్‌ యూనివర్సిటీలో మన గురుకులాలు కేస్‌ స్టడీ, వరల్డ్‌ బ్యాంక్‌ కేస్‌ స్టడీ ఎందుకు అయింది. అలాగే దేశంలోని అనేక రాష్ర్టాలకు మన గురుకులాలు మాడల్‌ ఎందుకయ్యాయి? గురుకుల విద్యార్థుల కోసం చిత్తశుద్ధితో పనిచేసిన. నా కమిట్‌మెంట్‌ చూసే కేసీఆర్‌ గురుకుల పాఠశాలల సంఖ్యను గణనీయంగా పెంచారు. విద్యా ప్రమాణాల పెంపులో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను చంపడంలో రికార్డును సృష్టిస్తున్నది…
మమ్మల్నే కాదు మా నీడను కూడా చూసి.. కాం గ్రెస్‌ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భ యపడుతున్నరు. అందుకు రేవంత్‌రెడ్డి, కొండా సు రేఖ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ వంటి వారి మాటలే నిదర్శనం. కేసీఆర్‌ మార్గదర్శకంలో మేం గురుకులాల బాట నిర్వహిస్తామని కేటీఆర్‌ చెప్పారు. గురుకులబాట రాజకీయ కోణం లేదని స్పష్టంగా చె ప్పారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఏం జరుగుతుం ది? అనే విషయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఏం చేయాలో ప్రభుత్వానికి సూచించే ఒక ని ర్మాణాత్మక కార్యక్రమం. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి మేం తెలుసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అర్థవంతమైన చర్చ కోసం, గురుకులబాట అనే కార్యక్రమం అనగానే రేవంత్‌రెడ్డికి ఎందుకు వెన్నులో వణుకు పుడుతున్నది. 48-50 మంది పిల్లలు చనిపోయేదాకా ప్రభుత్వం ఏం చేసినట్టు? అందులో మంత్రులు ఏమి చేసినట్టు? ఒకటే జిల్లాల్లో పదుల సంఖ్యలో సంఘటనలు జరుగుతుంటే… ఒకే హాస్టల్‌లో 10 రోజుల వ్యవధిలో నాలుగైదు ఘటనలు చోటుచేసుకుంటుంటే ఎందు కు పట్టించుకోలేదు. ఒకే స్కూల్‌లో ఇద్దరు పాముకాటుతో ఎట్లా చనిపోతరు? విషాహారం తిని ఒక అమ్మాయి ఎట్లా చనిపోద్ది. నిమ్స్‌లో చావు బతులకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినిని ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా చూసేందుకు రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదు? బాధ్యతాయుత ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ చేపట్టిన కార్యక్రమాన్ని చూసి వాళ్లకు భయం పట్టుకున్నది. అందులో భాగంగానే నాపైన, కేటీఆర్‌ పైన విమర్శలు చేస్తున్నరు..